News December 1, 2025

బాపట్ల MP గారు.. పార్లమెంటులో గట్టిగా గళం విప్పండి..!

image

బాపట్ల రైల్వేస్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ముందు వరకు ఆగే ఎక్స్‌ప్రెస్‌లు తర్వాత నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాలకు అవసరమైన రవాణా వ్యవస్థ కోసం వేచి చూస్తున్నారు. ఉప్పరపాలెం రహదారిలో ROB ఏర్పాటు, పర్యాటక కేంద్రం విస్తరిస్తున్న సమయంలో రవాణా మెరుగునకు పార్లమెంట్‌లో MP కృష్ణ ప్రసాద్ గళం విప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News December 3, 2025

నల్గొండ: రైతులకు గుడ్ న్యూస్.. అందుబాటులో వరి విత్తనాలు

image

త్రిపురారం మండలం వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్‌లో వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ లింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్‌కు అనువైన వరి రకాలైన కేఎన్ఎం-118, కేఎన్ఎం-1638, ఆర్ఎన్ఆర్-15048, కేపీఎస్-6251, జేజీఎల్-24423 విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు 9640370666 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

News December 3, 2025

గాన గంధర్వుడి విగ్రహంపై వివాదం.. మీరేమంటారు?

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును పలువురు <<18452414>>అడ్డుకోవడంపై<<>> నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. ఎస్పీ బాలు ప్రాంతాలకు అతీతం అని, అలాంటి గొప్పవారి విగ్రహాన్ని అడ్డుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బాలు తెలుగువాడైనప్పటికీ తమిళనాడులో ఓ రోడ్డుకు ఆయన పేరు పెట్టారని గుర్తు చేస్తున్నారు. మరికొందరు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News December 3, 2025

అయ్యప్ప భక్తుల కోసం కాగజ్‌నగర్–కొల్లాం మధ్య ప్రత్యేక రైలు

image

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం డిసెంబర్ 13న కాగజ్‌నగర్ నుంచి కొల్లాం జంక్షన్ వరకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అభ్యర్థనపై ఈ రైలు ఏర్పాటైందని, అన్ని తరగతుల బోగీలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మకరజ్యోతి దర్శనానికి కూడా ప్రత్యేక రైలు నడపాలని రైల్వే అధికారులను కోరినట్లు పేర్కొన్నారు.