News February 2, 2025
బాపట్ల: PGRS కార్యక్రమం రద్దు
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాపట్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News February 2, 2025
KMM: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు
NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News February 2, 2025
భద్రాద్రి కలెక్టరేట్లో రేపు ప్రజావాణి కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News February 2, 2025
బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస
TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.