News January 30, 2025

బాపుజీ మార్గం అంద‌రికీ ఆద‌ర్శ‌నీయం: కలెక్టర్

image

అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల‌ను అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ చూపిన మార్గం అంద‌రికీ ఆద‌ర్శ‌నీయ‌మ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో కలెక్టర్ గాంధీ చిత్ర‌పటానికి పూల మాల‌లు వేసి నివాళులర్పించారు. 

Similar News

News September 16, 2025

MHBD: విద్యార్థిని చితకబాదిన దుకాణం యజమాని

image

చాక్లెట్లు కొనేందుకు దుకాణానికి వెళ్లిన విద్యార్థిని చితకబాదిన ఘటన కురవి మండలం కంచర్లగూడెంలో చోటుచేసుకుంది. కంచర్లగూడెం పాఠశాలలో విద్యార్థి ఆకాశ్ 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నారులు ఏడుస్తుండటంతో చాక్లెట్ల కోసం అతన్ని టీచర్ షాపునకు పంపాడు. అక్కడే ఉన్న కోతులు దాడి చేస్తాయని షాపులోకి వెళ్లిన అతన్ని యజమాని చూశాడు. కోతులు రావడంతో షాపులోకి వచ్చానని చెప్పినా వినకుండా చితకబాదినట్లు బాధితులు తెలిపారు.

News September 16, 2025

ప్రసారభారతిలో ఉద్యోగాలు

image

న్యూఢిల్లీలోని <>ప్రసార భారతి<<>> 50 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు ఉద్యోగ అనుభవం గల వారు ఈనెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/

News September 16, 2025

నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

image

గడిచిన 24 గంటలలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 397.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 46.8, సోన్ 44, కడెం పెద్దూర్ 39.4, మామడ 30, దిలావర్పూర్ 32.4, బైంసా 28.2, ముధోల్ 19.6, లోకేశ్వరం 21.6, నిర్మల్ మండలాలలో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.