News April 5, 2024
బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం: రాజనర్సింహ

అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన మహనీయుడు భారత దేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళి అర్పించారు. అయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు.
Similar News
News July 7, 2025
మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News July 7, 2025
తూప్రాన్: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు గురుకుల విద్యార్థులు

తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తారా సింగ్ తెలిపారు. గురుకుల కళాశాల విద్యార్థులు రాకేశ్, విష్ణు శ్రీ చరణ్ ఇరువురు డెహ్రాడూన్‌లో ఈ నెల 12 నుంచి జరిగే రగ్బీ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రిన్సిపల్‌తో పాటు వైస్ ప్రిన్సిపల్ సుహాసిని, పీఈటీ రమేశ్, పీడీ నవీన్ విద్యార్థులను అభినందించారు.
News July 7, 2025
మెదక్: కుంటుంబం చెంతకు తప్పిపోయిన బాలుడు

మెదక్ పట్టణానికి చెందిన <<16899428>>వాసిప్ హుస్సేన్<<>> మానసిక స్థితి సరిగ్గా లేక వారం రోజుల కింద తప్పిపోయాడు. Way2Newsలో వచ్చిన కథనంతో తప్పిపోయిన బాలుడు కుటుంబం చేంతకు చేరాడు. వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో సంచరిస్తున్న బాలుడిని గ్రామస్థులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.