News March 1, 2025
బాబోయే.. మండుతున్న ఎండలు

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. పరిగి మండలంలో నిన్న 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడే ఇలా ఉంటే మనుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల నేపథ్యంలో భయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News March 1, 2025
80% పెన్షన్ల పంపిణీ పూర్తి: TDP

AP: రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పెన్షన్ నగదు పంపిణీ కార్యక్రమం మూడు గంటల్లోనే 80 శాతం పూర్తైనట్లు టీడీపీ ట్వీట్ చేసింది. గత నెల వరకు తెల్లవారుజామున 5 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయగా.. ఉద్యోగులు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పంపిణీ ప్రారంభ సమయాన్ని ప్రభుత్వం 7 గంటలకు మార్చిన విషయం తెలిసిందే.
News March 1, 2025
భీమిని: కీచక ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

భీమిని మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు రేగుచెట్టు రమేశ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయుడు తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా.. ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు, బంధువులు దాడికి యత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి, పోక్సో కేసు నమోదు చేశారు.
News March 1, 2025
4 ఎమ్మెల్సీ స్థానాలు.. కాంగ్రెస్‌లో గట్టి పోటీ

TG: తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్‌కు 4 దక్కే ఛాన్స్ ఉంది. ఇందుకోసం 40 మంది వరకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గా రెడ్డి, మధుయాష్కీ, సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, రాములు నాయక్, అంజన్ కుమార్ యాదవ్, సరితా యాదవ్ తదితరులు పోటీలో ఉన్నట్లు సమాచారం. యువ నాయకులకు ఛాన్స్ ఇవ్వాలని క్యాడర్ కోరుతోంది.