News November 3, 2025

బా’భౌ’య్.. GVMCలో 2లక్షల వీధి కుక్కలు..!

image

GVMC పరిధిలోని 8జోన్లలో దాదాపు 2లక్షల వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారానికి 5నుంచి 9కుక్క దాడి ఘటనలు నమోదు అవుతున్నట్లు సమాచారం. వాటి నియంత్రణ చర్యల్లో భాగంగా అరిలోవ, కాపులుప్పాడ, సవరాల ప్రాంతాల్లోని ప్రత్యేక కేంద్రాల్లో రోజుకు సగటున 80 కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డా.రాజ రవికుమార్ తెలిపారు. ఒక్కో కుక్కపై సుమారు రూ.900 ఖర్చు అవుతుందన్నారు.

Similar News

News November 3, 2025

KNR: ముగిసిన అర్బన్ బ్యాంక్‌ ఆఫీస్ బేరర్ల ఎన్నికలు

image

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్‌, ఆఫీస్‌ బేరర్ల ఎన్నికలు ఈ రోజు ఉదయం బ్యాంక్ కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా కర్ర రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపాధ్యక్ష పదవికి ఎవరు కూడా నామినేషన్ సమర్పించినందున, మిగతా 11 మంది సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ ప్రకటించారు. నూతన పాలకవర్గ పదవీకాలం ఐదు సంవత్సరాల వరకు ఉండును.

News November 3, 2025

435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

image

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.

News November 3, 2025

టిప్పర్ డ్రైవర్ గుర్తింపు

image

TG: రంగారెడ్డి జిల్లాలో <<18184089>>బస్సు ప్రమాదానికి<<>> కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. అతడు మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ అని వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన లచ్చానాయక్ దగ్గర డ్రైవర్‌గా పని చేస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్ శివారు పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు కంకర తీసుకెళ్తుండగా మీర్జాగూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆకాశ్ కూడా చనిపోయాడు.