News December 25, 2025

‘బాయిలోనే బల్లి పలికె’ పాడింది జగిత్యాల మహిళనే..!

image

సంగీతం నేర్చుకోలేదు.. ఏ వేదికల మీద శిక్షణ పొందలేదు. కానీ, ఆమె గొంతు విప్పితే చాలు, పల్లె పదాలు పరవళ్లు తొక్కుతాయి. జగిత్యాల(D) ఎండపల్లి(M)గుల్లకోట ఆడబిడ్డ చుంచు నాగవ్వ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారారు. ఆమె పాడిన ‘బాయిలోనే బల్లి పలికె’ జానపద గీతం దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టింది. నాగవ్వ విజయం కేవలం ఆమె ఒక్కరిదే కాదు, యావత్ గుల్లకోట ప్రజలదని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు.

Similar News

News December 26, 2025

గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్‌ ఎవరంటే..?

image

ఎట్టకేలకు గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు చాలామంది ఆశావహులు పోటీపడ్డారు. అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.

News December 26, 2025

విశాఖలో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకం

image

విశాఖలో రూ.1,425 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. GVMC ఆధ్వర్యంలో నగరంలోని మధురవాడ, ఆర్ఆర్ సెంటర్, గాజువాక, కూర్మన్నపాలెం, దువ్వాడ ఫ్లైఓవర్ కింద, సూర్యబాగ్ సెంట్రల్ పార్క్ ప్రాంతాల్లో తొలి దశలో 250 వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు.ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం, నగర సుందరీకరణ, వీధి వ్యాపారుల జీవనోపాధి భద్రతే ఈ పథకం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.

News December 26, 2025

సంక్రాంతి సెలవులకు ముందు FA-3 పరీక్షలు

image

AP: ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో సంక్రాంతి సెలవులకు ముందు ఫార్మెటివ్ అసెస్మెంటు-3 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. JAN 5 నుంచి 8వరకు 1-5 తరగతులకు ఉ.9.30-10.45 గంటల మధ్య, మ.1.15-2.30 గంటల మధ్య పరీక్షలుంటాయి. 6-10 తరగతుల వారికీ ఉదయం, మధ్యాహ్నం రెండేసి సెషన్లు టెస్ట్ నిర్వహిస్తారు. సిలబస్, మోడల్ పేపర్లతో SCERT సర్క్యులర్ జారీచేసింది. 8న పరీక్షలు ముగియనుండగా 10నుంచి సంక్రాంతి సెలవులు మొదలవుతాయి.