News January 3, 2026
బాయ్‌ఫ్రెండ్‌ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి..

ముంబైలో బాయ్‌ఫ్రెండ్‌ను న్యూ ఇయర్ పార్టీకి పిలిచి ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా దాడి చేసిందో మహిళ. శాంటాక్రూజ్‌లో ఉండే మహిళ(25), బాధితుడు(42) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఎన్నిసార్లు అడిగినా అతడు నిరాకరించాడు. దీంతో న్యూఇయర్ వేడుకలని అతడిని ఇంటికి ఆహ్వానించింది. పదునైన కత్తితో మర్మాంగాలపై అటాక్ చేసింది. బాధితుడు పారిపోయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమె పరారీలో ఉంది.
Similar News
News February 15, 2026
స్టార్ యాక్టర్ నన్ను మోసం చేశాడు: మమతా మోహన్‌దాస్

తాను క్యాన్సర్, బొల్లి సమస్యలతో బాధపడుతున్నప్పుడే ప్రేమ, పెళ్లి విషయంలో ఎంతో మానసిక వేదన అనుభవించానని హీరోయిన్ <<10013472>>మమతా మోహన్‌దాస్<<>> తెలిపారు. ‘ఆ టైంలో ఓ ప్రముఖ మలయాళ నటుడితో డేటింగ్ చేశా. అయితే అతనికి అప్పటికే వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని దాచి మోసం చేశాడు’ అని ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈమె 2011లో ప్రజిత్‌ను పెళ్లి చేసుకోగా 6 నెలలకే విడిపోయారు.
News February 15, 2026
తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

తూర్పుగోదావరి జిల్లాలోని స్పెషల్ జ్యుడిషీయల్ సెకండ్ క్లాస్ కోర్టుల్లో 6 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. కోర్టు అసిస్టెంట్స్, కోర్టు అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, 7వ తరగతి, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://eastgodavari.dcourts.gov.in
News February 15, 2026
అనుకోకుండా జాగరణ చేసినందుకే!

గుణనిధి కథ మహాశివరాత్రి ఉపవాసం, జాగరణల విశిష్టతను తెలుపుతుంది. దురలవాట్లు గల గుణనిధి ఓ శివరాత్రి నాడు ఆహారం దొరకక అనివార్యంగా ఉపవాసం ఉన్నాడు. ప్రసాదం కోసం శివాలయానికి వెళ్తే అక్కడ అందరూ జాగారణ చేస్తూ కనిపించారు. దీంతో గుణనిధి కూడా జాగరణ చేస్తాడు. చివరకు ఆలయంలోనే మరణిస్తాడు. కానీ, తెలియకుండానే ఉపవాసం ఉండి జాగరణ చేయడంతో పాపాలు నశించాయి. మరుసటి జన్మలో నిధుల అధిపతి కుబేరుడిగా జన్మించాడు.


