News August 27, 2025

బార్ లైసెన్స్ దరఖాస్తు గడువు పొడిగింపు: ఆవులయ్య

image

నూతన బార్ పాలసీ 2025-28 కింద బార్ల ఏర్పాటు కోసం దరఖాస్తు గడువును ఆగస్టు 29 వరకు పొడిగించినట్లు జిల్లా మధ్య నిషేధ, అబ్కారీ అధికారి ఆవులయ్య తెలిపారు. లాటరీ డ్రా తేదీని ఆగస్టు 30 ఉదయం 8 గంటలకు మార్చినట్లు ఆయన చెప్పారు. ఏలూరు కలెక్టర్ ఆధ్వర్యంలో గోదావరి కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ లాటరీ నిర్వహించబడుతుందన్నారు.

Similar News

News August 27, 2025

ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ‘కవచ్’ లోకోను ప్రారంభించిన DRM

image

విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో మంగళవారం ‘కవచ్’ లోకోను DRM లలిత్ బొహ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలను నివారించడానికి స్వదేశీ పరిజ్ఞానంతో
‘కవచ్’ వ్యవస్థ రూపొందించినట్లు పేర్కొన్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్ మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీ కొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందన్నారు.

News August 27, 2025

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ UPDATE

image

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం, SRSP, ఎగువ నుంచి పెద్దఎత్తున వరదనీటి ప్రవాహం పెరిగిపోతుంది. బుధవారం ఉదయం ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువనకు 25, 074 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 148 మీటర్లకు గాను 147.78 మీటర్లకు నీరు చేరింది. 20.175 TMCలకు గాను 19.5641 TMCలకు చేరుకుంది. ఇన్‌ఫ్లో 20,814 c/sలు, అవుట్‌ఫ్లో 28,537 c/sల వరకు చేరుకుంది.

News August 27, 2025

NGKL: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

image

గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన అధికారులు ఈ జాబితాను గ్రామపంచాయతీలలో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న అభ్యంతరాల స్వీకరణ, 31న తుది జాబితా విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి MBNR జిల్లాలో మొత్తం 1670 గ్రామపంచాయతీలు ఉండగా NGKL జిల్లాలో 464 గ్రామపంచాయతీలు ఉన్నాయి.