News September 26, 2025
బాలకృష్ణా.. నోరు అదుపులో పెట్టుకో : కాకాణి

అభిమానులను కొడుతూ, తిడుతూ ఉన్మాదిలా ప్రవర్తించే బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్ది అగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్‌పై అయన మాట్లాడిన మాటలు వింటుంటే, పిచ్చి మళ్లీ ముదిరిందా లేక మద్యం మత్తులో ఉన్నాడా అనే అనుమానం కల్గుతుందన్నారు. బాలకృష్ణ మాట్లాడినవన్నీ అబద్దాలని చిరంజీవి వివరణ రుజువైందని X లో కాకాణి పోస్ట్ చేశారు.
Similar News
News September 26, 2025
42192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు : నోడల్ ఆఫీసర్

స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 490 వైద్య శిబిరాలు నిర్వహించి 42,192 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించినట్లు ఆ ప్రోగ్రాం రాష్ట్ర నోడల్ ఆఫీసర్ స్టేఫీ తెలిపారు. వరిగొండ, దామర మడుగులలో జరుగుతున్న వైద్య శిబిరాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహిళా ఆరోగ్య పరిరక్షణ కోసం ఈకార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు.
News September 26, 2025
గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలకు అనుమతి లేదు: SI అంకమ్మ రావు

ఉలవపాడు మండలం బద్దిపూడిలో గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలపై ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెల 27 నుంచి జరిగే ఉత్సవాలకు అనుమతులు నిలిపివేసినట్లు SI అంకమ్మరావు గురువారం తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత గ్రామ పెద్దలు, ప్రజల ఏకాభిప్రాయంతో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చున్నారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
News September 25, 2025
ఇంటర్ పరీక్షా ఫీజును చెల్లించండి: ఆర్‌ఐఓ

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజును అక్టోబర్ 10వ తేదీలోపు చెల్లించాలని ఆర్ఐఓ వరప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చునని, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ నిర్ణీత తేదీలోపు పరీక్షా ఫీజులు చెల్లించాలని, ఈ విషయాన్ని అన్ని కళాశాలలు గమనించాల్సిందిగా కోరారు.