News November 14, 2024
బాలలే దేశ భవిష్యత్.. గవర్నర్ అబ్దుల్ నజీర్
బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ రాజ్‌భవన్ నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. దివంగత భారత ప్రధాని పండిట్ నెహ్రు జన్మదినమైన ఈ రోజు ఆయనను స్మరించుకోవాలన్నారు. పిల్లలే దేశ భవిష్యత్ అని, ఉత్తమ పౌరులుగా వారిని తీర్చిదిద్దాలని గవర్నర్ స్పష్టం చేశారు.
Similar News
News November 21, 2024
కృష్ణా: బీఈడీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో బీఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ గురువారం విడుదలైంది. డిసెంబర్ 6,7,9, 10న బీఈడీ, డిసెంబర్ 6,7, 9,10,11,12న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ చూడాలని కోరింది.
News November 21, 2024
విజయవాడలో పోగొట్టుకున్న ఫోన్ అప్పగింత
విజయవాడ పటమట పోలీసులు పనితీరుపై ప్రజలు ప్రశంసించారు. విజయవాడ మహానాడు రోడ్లో ఓ బ్యాంక్‌లో పీఓగా పనిచేస్తున్న కిషోర్ అనే వ్యక్తి తన ఫోన్ ఈనెల 1వ తేదీన పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో బాధితుడు పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాంకేతిక సాయంతో ఫోన్ గుర్తించి బాధితుడికి గురువారం అందజేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఫోన్లు పోతే ఎవరు నిరుత్సాహానికి గురవ్వాల్సిన అవసరం లేదని సీఐ అన్నారు.
News November 21, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన ఫార్మ్‌డీ కోర్సు 2, 3, 4వ ఏడాది పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.