News November 13, 2024

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలలందరికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యానికి, అభివృద్ధికి నెహ్రూ కృషి చేశారని మంత్రి పునరుద్ఘాటించారు. బాలలు తల్లిదండ్రుల కలల ప్రతిరూపాలు అని, భావి భారత పౌరులని వారికి విద్యతో పాటు మంచి విలువలను నేర్పాలని ఆకాంక్షించారు. 

Similar News

News December 22, 2025

KNR: JAN 31 వరకు ఉచితంగా మందులు

image

కరీంనగర్ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం సోమవారం కొత్తపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లా అధికారి డాక్టర్ ఎన్. లింగారెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, జీవాలకు మందులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 22 నుంచి జనవరి 31 వరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

News December 22, 2025

KNR: ‘డ్రగ్స్‌ నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి’

image

KNR జిల్లాలో మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టేందుకు అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పోలీస్, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. మెడికల్ స్టోర్లలో వైద్యుల చీటీ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాసంస్థలలో అవగాహన కల్పించాలన్నారు.

News December 22, 2025

KNR: పత్తి రైతుకు మళ్లీ ‘ధర దెబ్బ’..!

image

కరీంనగర్ జిల్లాలో పత్తి పండించే రైతులపై మరో ఆర్థిక భారం పడింది. పత్తి నాణ్యత(పింజు పొడవు) తగ్గిందనే సాకుతో సీసీఐ మద్దతు ధరలో సోమవారం నుంచి మరో రూ.50 కోత విధించనుంది. గతనెలలో ఇప్పటికే రూ.50 తగ్గించగా, తాజాగా మరో రూ.50 తగ్గించడంతో క్వింటా పత్తి ధర రూ.8,010 కి పడిపోయింది. తమ కష్టార్జితానికి నాణ్యత పేరుతో ధర తగ్గించడంపై పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.