News September 3, 2025
బాలల సంరక్షణ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: జేసీ

నంద్యాల జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలలో కనీస సౌకర్యాలు తప్పక కల్పించాలని జేసీ విష్ణు చరణ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్య, వైద్య, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అని ప్రతి మూడు నెలలు ఒకసారి జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీలు చేసి నివేదికను తమకు సమర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు.
Similar News
News September 5, 2025
అనకాపల్లి జిల్లాలో 39 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: డీఈవో

అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 39 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు డీఈవో అప్పారావు నాయుడు గురువారం తెలిపారు. శుక్రవారం అనకాపల్లి గుండాల జంక్షన్ వద్ద గల శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన వీరికి సన్మానం, అవార్డుల బహుకరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యఅతిథిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొంటున్నట్లు తెలిపారు.
News September 5, 2025
నేడు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనానికి సీఎం

సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉ.10 గం.కు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం, కొండా సురేఖ కూడా రానున్నారు. కాగా, మహాగణపతి నిమజ్జనానికి బయలుదేరుతుండటంతో పందిరి తొలగింపు, టస్కర్ ఏర్పాట్ల నేపథ్యంలో నిర్వాహకులు భక్తులను అనుమతించడంలేదు.
News September 5, 2025
నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలి: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లాలో మరో 500 మెట్రిక్ టన్నుల నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసేలా అనుమతించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరుతోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.