News October 7, 2025

బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాలి: నిర్మల్ కలెక్టర్

image

బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో అమలు చేస్తున్న బాలశక్తి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. మొదటి దశలో భాగంగా జిల్లాలోని కేజీబీవీలలో విజయవంతంగా బాలశక్తి కార్యక్రమాన్ని అమలుపరిచామని వెల్లడించారు.

Similar News

News March 9, 2026

ట్రోఫీతో గుడికి.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

image

1983 WC విజేత, TMC MP కీర్తి ఆజాద్ టీమ్ఇండియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. T20 WC ట్రోఫీతో <<19333290>>హిందూ ఆలయానికి<<>> వెళ్లడాన్ని తప్పుబట్టారు. టీమ్ఇండియా 140 కోట్ల భారతీయులు, అన్ని మతాలను రిప్రజెంట్ చేస్తుందని.. కేవలం ఒక మతానిదో లేదా జై షా కుటుంబానిదో కాదని విమర్శించారు. సిరాజ్ మసీదుకు లేదా శాంసన్ చర్చికి ట్రోఫీని తీసుకెళ్లలేదన్నారు. ఒకే మతం చుట్టూ విజయాన్ని తిప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.

News March 9, 2026

12న రాజమండ్రిలో స్పెషల్ డ్రైవ్

image

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ఈ నెల 12వ తేదీన రాజమండ్రిలో ‘జన్ సున్వాయి’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు అధికారి టి.శ్రీదేవి సోమవారం తెలిపారు. జిల్లా యంత్రాంగం, లీగల్ సెల్, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. గృహహింస, ఇతర అన్యాయాలకు గురయ్యే మహిళలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఆమె వెల్లడించారు.

News March 9, 2026

గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

image

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.