News February 23, 2025
బాలానగర్‌లో నర్సింగ్ విద్యార్థి SUICIDE

ఉరేసుకొని నర్సింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలంలోని రామేశ్వరం గ్రామానికి చెందిన కృష్ణయ్యకు నలుగురు కూతుర్లు. వీరు జీవనోపాధి కోసం బాలానగర్‌కి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కృష్ణయ్య చిన్న కూతురు సింధుజ (17) ఉరేసుకున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News January 1, 2026
క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలి: SP

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కవాతు మైదానంలో ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. SP జానకి మాట్లాడుతూ.. గత సంవత్సరంలో జిల్లా పోలీస్ శాఖ ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. నూతన సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు.
News January 1, 2026
మహబూబ్‌నగర్ ఎస్పీకి ప్రమోషన్

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న డి.జానకికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి నేటి నుంచి అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజు నుంచే జిల్లా ఎస్పీ సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహిస్తారు.
News January 1, 2026
పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు వరించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని ఈనెల 2న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదానం చేయనున్నారు. #CONGRATULATIONS


