News October 25, 2025

బాలానగర్‌లో మురుగు కాలువలో శిశువు మృతదేహం

image

మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. భవాని మాత ఆలయం సమీపంలోని మురుగు కాలువలో గురువారం సాయంత్రం అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం కవర్‌లో లభ్యమైంది. పంచాయతీ సిబ్బంది సమాచారంతో ఎస్ఐ లెనిన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు.

Similar News

News October 25, 2025

వనపర్తి: డ్రా తీసే హాల్‌లోకి ఫోన్లు అనుమతి లేదు

image

మద్యం షాపుల డ్రా కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని దీంతో ఈనెల 27న యథావిధిగా డ్రా ప్రక్రియ ఉంటుందని వనపర్తి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు అన్నారు. ఐడీఓసీ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు మద్యం షాపుల డ్రా ప్రక్రియ ఉంటుందన్నారు. డ్రా పద్ధతిలో ఎంపిక చేసి లైసెన్సులు జారీ చేయనున్నట్లు తెలిపారు. డ్రా తీసే హాలులోకి ఫోన్ల అనుమతి లేదన్నారు.

News October 25, 2025

పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామివారి దర్శనం

image

నాగుల చవితి సందర్భంగా శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి తిరుమాడ వీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. సర్పరాజైన ఆదిశేషుడు స్వామివారికి శయనాసనం, సింహాసనం, నివాస స్థలం వంటి సేవలు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా అవతరించాడని విశ్వాసం.

News October 25, 2025

లింగాలలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు రాత్రి ప్రకటించారు. జిల్లాలోనే అత్యధికంగా లింగాల మండలంలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బల్మూరులో 18.9, పదరలో 17.9, తెలకపల్లిలో 17.4, తిమ్మాజిపేటలో 16.5, బిజినేపల్లిలో 10.3, అచ్చంపేటలో 8.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.