News April 13, 2025
బాలానగర్ ఘటన.. మృతుడి వివరాలు (UPDATE)

బాలానగర్‌లో RTC బస్ కింద పడి ఓ బైకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు AP కొనసీమ జిల్లాకు చెందిన జోష్ బాబు(బాబ్జీ)గా పోలీసులు గుర్తించారు. రన్నింగ్‌లో ఉన్న వెహికిల్‌ను ఆపే క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని లాగారని PSలో మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 15, 2025
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ.200లోపు చేశారు. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్‌సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ.213, స్కిన్‌లెస్ KG రూ.243గా నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ.220 నుంచి రూ.250 మధ్యన అమ్ముతున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గిరాకీ లేక తీవ్రంగా నష్టాలు చవిచూశామని చికెన్ వ్యాపారులు తెలిపారు. ఇక డిమాండ్‌కు తగ్గట్లు ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.
News April 15, 2025
HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్‌లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 14, 2025
జూబ్లీహిల్స్ పెద్దమ్మను దర్శించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి

సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు విజయం సాధించిన సందర్భంగా ఆయన అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.