News March 3, 2025
బాలానగర్: భార్యను అవమానపరిచిన భర్త.. చివరికి.!

ఓ మహిళ వాగులో దూకి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. గుండెడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి (38) ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన లింగమయ్యతో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో భార్యను అవమానపరిచి నిందించాడు. అవమానం భరించలేక దుందుభి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 4, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔రెండవ రోజు ముగిసిన రంజాన్ ఉపవాసం
✔సహార్: రేపు(మంగళవారం)-5:12
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల డ్రంక్& డ్రైవ్
✔పెండింగ్ చలాన్లు చెల్లించండి: ఎస్సైలు
✔లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి:SPలు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔రేపు చలోమాల- చలో అలంపూర్
✔ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రత్యేకంగా నిఘా
✔పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
✔వీజీ ట్రోఫీకి ఎంపికైన పీయూ క్రీడాకారుడు
News March 4, 2025
మహబూబ్ నగర్ జిల్లా… నేటి ముఖ్యంశాలు

✓భర్త వేధింపులు భరించలేక దుందుభి వాగులో పడి మహిళా మృతి.
✓ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు
✓ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ విజయేంద్ర బోయి
✓మిడ్జిల్ మండలంలోని మంగళగడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకి వినతి పత్రం
✓జిల్లాలో మండుతున్న ఎండలు.. బయటికి రావాలంటే జంకుతున్న జనం.
✓అడ్డాకుల : కందూరు రామలింగేశ్వర స్వామి ఆవరణలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.
News March 3, 2025
MBNR: అరుణాచలానికి పాలమూరు నుంచి ప్రత్యేక బస్సులు.!

తమిళనాడు రాష్ట్రంలోని ప్రత్యేక పుణ్యక్షేత్రం అరుణాచలానికి మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న మహబూబ్ నగర్ డిపో నుంచి బస్సు వెళ్లనున్నట్లు తెలిపారు. మార్చి 13 సా.6 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. మార్చి 14న అక్కడి నుంచి బయలుదేరి 15న ఉదయం మహబూబ్ నగర్ చేరుకుంటుందని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.