News April 10, 2025
బాలానగర్: రైలు ఢీకొని.. వృద్ధురాలు మృతి

రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి రైల్వే ట్రాక్‌పై బుధవారం జరిగింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. పెద్దాయపల్లికి చెందిన బొట్టు మైసమ్మ (60) హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్తున్న రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. స్టేషన్ మాస్టర్ నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Similar News
News April 18, 2025
నాగర్‌కర్నూల్: పోలీస్ కస్టడీలో గ్యాంగ్ రేప్ నిందితులు

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఇటీవల మహిళపై ఏడుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన తెలిసిందే. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు గురువారం కస్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. ఊర్కొండపేట దేవాలయం సమీపంలో వారు గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
News April 18, 2025
వసతి గృహంలో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ తనిఖీ

MBNR జిల్లా కేంద్రంలోని బాలికల గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యపై దృష్టి పెట్టి చదువులో బాగా రాణించాలని విద్యార్థులకు సూచించారు. విద్యతోపాటు ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండాలని చెప్పారు.
News April 18, 2025
ధరణి పోర్టల్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. మీ కామెంట్..?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తున్న భూభారతి కార్యక్రమంతో భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలో గురువారం భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మూలంగా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. దీనిపై మీ కామెంట్?