News September 5, 2025
బాలాపూర్ లడ్డూ కోసం కొత్తగా ఏడుగురు పోటీ

బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో పాల్గొనే కొత్తవారి జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు. గత సంవత్సరం కొలన్ శంకర్ రూ.30.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. ఈసారి మర్రి రవి కిరణ్ రెడ్డి, సామ ప్రణీత్ రెడ్డి, లింగాల దశరథ్ గౌడ్, కంచర్ల శివరెడ్డి, సామ రామ్ రెడ్డి, PSK గ్రూప్, జిట్టా పద్మా సురేంద్ రెడ్డి లడ్డూ కోసం కొత్తగా పోటీ పడనున్నారు. లాస్ట్ ఇయర్ వరకు లడ్డూ దక్కించుకొన్న వాళ్లు వేలంలో పాల్గొంటారు.
Similar News
News September 6, 2025
HYD: నిమ‘జ్జనం’.. సాగర సంబరం

వినాయకచవితి ఉత్సవాల్లో కీలక ఘట్టానికి వేళయింది. ఖైరతాబాద్ మహా గణపతి భారీ శోభాయాత్ర, బాలాపూర్ లడ్డూ వేలం పాట హైలెట్‌గా నిలవనున్నాయి. సిటీలోని భారీ విగ్రహాలు ఊరేగింపుగా గంగఒడికి చేరనున్నాయి. లక్షలాది మంది నిమజ్జనోత్సవానికి తరలిరానున్నారు. వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ట్యాంక్‌బండ్ కిటకిటలాడనుంది. సాగర్‌లో సంబరం అంబరాన్ని అంటనుంది.
News September 6, 2025
కోఠి: 49 ఏళ్లుగా పూజలందుకుంటున్న గణనాథుడు

49 ఏళ్లుగా నిర్విరామంగా భక్తుల పూజలందుకుంటున్నాడు కోఠి ఇసామియా బజార్‌లో కొలువైన ఈ 18 అడుగుల భారీ గణనాథుడు. 1976లో చిన్న ప్రతిమతో ప్రారంభమైన ప్రతిష్ఠ ఏటా పెరుగుతూ వస్తుందని శ్రీ గణేశ్ యూత్ అసోసియేషన్ మెంబర్ రాహుల్ తెలిపారు. ఇక గణపయ్యకు నివేదించే లడ్డూను ఏళ్లుగా ఎలాంటి వేలం వేయకుండా స్థానికులకు ఉచితంగా పంచుతున్నట్లు చెప్పారు. స్పెషల్ బ్యాండ్‌తో రేపు సాగర్‌లో వినాయక నిమజ్జనం ఉంటుందని పేర్కొన్నారు.
News September 5, 2025
HYD: ఆదివారం ఆలయాలు బంద్

ఈ నెల 7వ తేదీన(ఆదివారం) చంద్ర గ్రహణం ఉంది. ఆ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మధ్యాహ్నం 12 గంటలకు మూసి వేస్తామని ఆలయ కార్యనిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు తెరుస్తామని చెప్పారు. ఇక చిల్కూరు బాలాజీ ఆలయం ఆదివారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. సోమవారం ఉదయం 8 గంటలకు తెరుస్తారు. భక్తులు గమనించాలని ఆలయ సిబ్బంది సూచించారు.
SHARE IT