News April 9, 2025

బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఆర్ఎంపీ డాక్టర్ అరెస్ట్

image

మూడో తరగతి చదువుతున్న బాలికపై పక్క ఇంట్లో ఆర్ఎంపీ డాక్టర్‌గా ఉంటున్న యాళ్ల రత్న ప్రసాద్ (56) లైంగిక దాడికి యత్నించాడు. పోలీసులు అతనిని 24 గంటలు గడవక ముందే అరెస్టు చేశారు. ఈ ఘటన ఏలూరు రూరల్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకుని వెళ్లి తలుపులు వేసేసరికి చుట్టుపక్కల ఉన్నవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News April 18, 2025

ADB: విద్యార్థులు SPORTS ట్రైనింగ్‌కి సిద్ధం కండి

image

సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్‌లో వేసవి శిక్షణ శిబిరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. 6 నుంచి 14 ఏళ్ల బాలబాలికలు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 18, 2025

మామునూర్: వ్యక్తి సూసైడ్

image

కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మామునూర్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీకాంత్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గుంటూరుపల్లికి చెందిన పెనుముచ్చు శ్రీనివాస్ (45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. అతడి భార్య శ్వేత చూసి ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం ఇవ్వగా.. అప్పటికే చనిపోయాడు. శ్రీనివాస్ తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

News April 18, 2025

వనపర్తి జిల్లాలో వ్యక్తికి జైలు శిక్ష..!

image

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ కే.రాణి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సంగినేనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి ఆటో నడిపినందుకు ఫస్ట్ అడిషనల్ జడ్జి ఆ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని కోర్టు పోలీస్ రాజేందర్ తెలిపారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఫైన్ విధించారన్నారు.

error: Content is protected !!