News January 24, 2026

బాలికలను ఎగరనిద్దాం..

image

అమ్మాయిలు ప్రస్తుతం యుద్ధ విమానాలు నడపడం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ తన ముద్ర వేస్తోంది. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం. బాలికలకు సమాన అవకాశాలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండేలా చూడటం ప్రధాన ఉద్దేశ్యం. కేవలం సమస్యల గురించే కాకుండా బాలికలు సాధిస్తున్న అద్భుత విజయాలను వేడుకగా జరుపుకోవడం కూడా ఇందులో భాగం.

Similar News

News January 29, 2026

రేపు ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’: భూమన

image

AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI ఛార్జ్‌‌షీట్లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. రేపు 10AMకు తిరుపతిలో ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’ చేపడతామని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు.

News January 29, 2026

₹3 కోట్లతో తీస్తే ₹30 కోట్ల వసూళ్లు.. ‘సిరాయ్’ చూశారా?

image

₹3 కోట్ల బడ్జెట్‌తో తమిళంలో తెరకెక్కిన సిరాయ్ మూవీ ₹31.58 కోట్ల వసూళ్లు సాధించింది. గతేడాది డిసెంబర్ 25న రిలీజై మేకర్లకు ఏకంగా 700% లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం Z5 OTTలో సందడి చేస్తోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఖైదీని జైలు నుంచి కోర్టుకు తీసుకెళ్లే ఓ కానిస్టేబుల్ (విక్రమ్ ప్రభు) కథే సిరాయ్. మూవీలో ట్విస్టులు, ఎమోషనల్ సీన్లు కట్టిపడేస్తాయి. యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు.

News January 29, 2026

ఈసారి ₹3.5 లక్షల కోట్లతో బడ్జెట్!

image

AP: FY26-27కి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు భారీగా పెరగొచ్చని తెలుస్తోంది. పెద్దఎత్తున పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులు వస్తుండడమే దీనికి కారణం. Fy25-26లో బడ్జెట్ ₹3,22,359.33cr కాగా ఈసారి ₹3.5 లక్షల కోట్ల వరకు అది ఉంటుందని అంచనా. దీంతో పాటు అగ్రికల్చర్ బడ్జెట్ గతంలో ₹48,341cr కాగా ఈసారి ₹60000crకు పెరుగుతుందని సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు FEB 11 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.