News January 26, 2026

బాలీవుడ్‌పై ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు

image

బాలీవుడ్‌ ప్లాస్టిక్ విగ్రహాల మ్యూజియంగా మారిందని నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇండస్ట్రీకి, ఆడియన్స్‌కు మధ్య సంబంధం తగ్గిపోతోందని అన్నారు. హిందీ చిత్రాలు మూలాలను కోల్పోతున్నాయన్నారు. చూడటానికి అందంగా, అద్భుతంగా ఉన్నప్పటికీ మ్యూజియంలోని విగ్రహాల్లా ఉన్నాయని ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో పేర్కొన్నారు. తమిళ్, మలయాళ చిత్రాలు కంటెంట్ పరంగా క్రియేటివ్‌గా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

Similar News

News February 17, 2026

23న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: CM రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ఈనెల 23న జరగనుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై దీనిలో చర్చించనున్నారు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపైనా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కాగా CM రేవంత్ ఇవాళ ముంబైకి వెళ్తున్నారు. MH CM ఆహ్వానం మేరకు అక్కడ జరిగే ‘క్లైమెట్ వీక్’లో పాల్గొననున్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రభుత్వ విజయాలపై ప్రసంగించనున్నారు.

News February 17, 2026

సూపర్-8లో భారత్ ప్రత్యర్థులు వీరే..

image

T20WC-2026లో సూపర్-8 జట్లు దాదాపుగా ఖరారయ్యాయి. రేపు నమీబియాపై గెలిస్తే <<19168498>>పాక్ సూపర్-8కు<<>> వెళ్తుంది.
సూపర్-8 గ్రూప్-1లో వెస్టిండీస్, భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్థాన్/USA, న్యూజిలాండ్ ఉంటాయి. భారత్ ఫిబ్రవరి 22న సౌతాఫ్రికా (అహ్మదాబాద్‌లో), 26న జింబాబ్వే (చెన్నైలో), మార్చి 1న వెస్టిండీస్‌ (కోల్‌కతాలో)తో తలపడనుంది.

News February 17, 2026

పాకిస్థాన్ సూపర్-8కు వెళ్లాలంటే?

image

T20WC-2026: సూపర్-8 చేరేందుకు పాకిస్థాన్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. నమీబియాపై గెలిస్తే 6 పాయింట్లతో నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ వర్షంతో రద్దయినా 5 పాయింట్లతో వెళ్తుంది. నమీబియాతో ఓడిపోతే మాత్రం పాకిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అప్పుడు USA సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఇక USAతో (+0.788)పోలిస్తే పాకిస్థాన్ (-0.403) నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది.