News December 18, 2024
బాల్కొండ: ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

బాల్కొండ మండల కేంద్రంలో బుధవారం జరిగిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. అనంతరం వారికి పలు సలహాలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీఓ గంగ మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2026
NZB: స్రవంతి రెడ్డికి (BJP) సర్టిఫికెట్ అందజేత

నిజామాబాద్ నగరంలోని 6వ డివిజన్‌లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డికి ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేశారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డిని బీజేపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత కార్పొరేషన్‌లో ఆమె బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు.
News February 13, 2026
NZB: బీజేపీ మేయర్ అభ్యర్థి స్రవంతి రెడ్డి విజయం

నిజామాబాద్ నగరంలోని ఆరో డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి విజయం సాధించారు. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన గోపిడి స్రవంతి రెడ్డి బీజేపీ మేయర్ అభ్యర్థిగా ఆరో డివిజన్ నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థిపై మెజారిటీతో గెలుపొందారు. తనకు ఓటు వేసి గెలిపించిన వార్డు సభ్యులకు స్రవంతి రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
News February 13, 2026
ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 36 వార్డులకు 19 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీని సాధించడంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్: 19 వార్డులు
బీజేపీ: 7 వార్డులు
బీఆర్ఎస్: 5 వార్డులు
ఇతరులు/స్వతంత్రులు: 4 వార్డులు
MIM: 1
హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గ చూపారు.


