News April 25, 2024

బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ కార్యక్రమం

image

గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ‘చిట్టి’ సమగ్ర మిషన్ కార్యక్రమం ప్రారంభించినట్టు పాడేరు సబ్ కలెక్టర్ పీ.ధాత్రిరెడ్డి తెలిపారు. బుధవారం చింతపల్లిలో అదనపు ఎస్పీ కే.ప్రతాప్ శివకిశోర్ తో కలిసి చిట్టి కార్యక్రమం ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో బాల్య వివాహాలు జరగడం వల్ల చిన్న వయస్సులో గర్భం దాల్చి మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు.

Similar News

News October 13, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు PGRS

image

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News October 12, 2025

బాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్‌లు ఏర్పాటు చేసిన సీపీ

image

విశాఖలో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్‌‌కు పలు స్వచ్చంధ సంస్థల్లో ఉంటున్న బాల బాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి ప్రత్యేక పాస్‌లు ఏర్పాటు చేశారు. 11 ఆర్గనైజేషన్ల నుంచి సుమారు 300 మంది బాలికలకు పాస్‌లు ఏర్పాటు చేసి వారితో కలిసి సీపీ మ్యాచ్ విక్షించారు. ఈ అవకాశం కల్పించిన సీపీతో పిల్లలు ఫొటోలు దిగారు.

News October 12, 2025

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

image

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.