News October 13, 2025

బాల్య వివాహాలు చట్టరీత్య నేరం: కలెక్టర్

image

బాల్య వివాహాలు సమాజానికి శాపమని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై పోరాడటానికి ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేసి, బాల్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. 18 ఏళ్ల లోపు బాలికకు, 21 ఏళ్ల లోపు బాలుడికి వివాహం చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. బాల్య వివాహాల సమాచారం అందించడానికి లేదా సహాయం కోసం వెంటనే టోల్-ఫ్రీ నంబర్లు 112, 1098, 100 లకు కాల్ చేయాలని సూచించారు.

Similar News

News October 13, 2025

పాకిస్థాన్‌కు అఫ్గాన్ షాక్!

image

<<17987289>>వివాదం<<>> వేళ పాక్‌కు అఫ్గాన్ షాక్ ఇచ్చింది. తమ దేశంలో పర్యటిద్దామనుకున్న డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖవాజా, ISI చీఫ్ ఆసిమ్ మాలిక్ వీసాలను రిజెక్ట్ చేసింది. అటు పాక్‌తో జరగనున్న టీ20 మ్యాచ్‌ను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్, లంక, అఫ్గాన్ త్వరలో ట్రై సిరీస్‌ ఆడాల్సి ఉంది. మరోవైపు భారత్‌తో సంబంధాలను తాలిబన్ ప్రభుత్వం పునరుద్ధించుకుంటోంది. ఆ దేశ మంత్రి ముత్తాఖీ IND పర్యటనలో ఉన్నారు.

News October 13, 2025

జగిత్యాల: ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక

image

జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఇసుక బజార్‌ ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 400–600 చదరపు అడుగుల్లోనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. బిల్లుల్లో జాప్యాలు, సమస్యలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. మేస్త్రి, కూలీల కొరత లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని తెలిపారు.

News October 13, 2025

పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

image

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్‌తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్‌తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT