News February 23, 2026
బాల్య వివాహ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. సమాజంలో వేళ్లూనుకున్న ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు
Similar News
News February 25, 2026
రష్యా-ఉక్రెయిన్ ‘కాల్పుల విరమణ’పై ఓటింగ్‌కు భారత్ దూరం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైన వేళ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, భారత్, చైనా సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని ఈ తీర్మానం కోరింది.
News February 25, 2026
సంగారెడ్డిలో ఈనెల 27న జాబ్ మేళా

సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీల భర్తీకి 18 నుంచి 35 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 08455-271010 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News February 25, 2026
విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరుగుతున్నప్పటికీ.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ వంటివాళ్లు ఉన్నారు. రేపు జరగనున్న ఈ పెళ్లికి మొత్తంగా 100 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.


