News January 2, 2026
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జనవరి 1 నుండి 31 వరకు ‘ఆపరేషన్ స్మైల్-XII’ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు సబ్ డివిజన్లలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కలిగించాలని ఆదేశించారు.
Similar News
News January 3, 2026
శ్రీకాకుళం: B.Ed పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 14 B.Ed కళాశాల్లో మొదటి సెమిస్టర్ పరీక్షలకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 17లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఈనెల 27 నుంచి పరీక్షలు నిర్వహించనున్నామని వెల్లడించారు. 1,000 మంది వరకు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. త్వరలో పరీక్ష షెడ్యూల్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
News January 3, 2026
విజయవాడ అభివృద్ధికి మెట్రో రైల్ అడ్డుపడుతుందా.?

విజయవాడ: నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చే మెట్రో, ఫ్లైఓవర్ల మధ్య సమన్వయ లోపంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గన్నవరం, పెనమలూరు మెట్రో మార్గాలకు కేంద్రం నుంచి ఏడాదిగా అనుమతులు రాకపోగా.. మరోవైపు మూడు ఫ్లైఓవర్ల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. మెట్రోపై స్పష్టత లేనిదే ముందుకు వెళ్లలేమని NHAI తేల్చి చెప్పడంతో, సీఎం చంద్రబాబు ఏ ప్రాజెక్టుకు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.
News January 3, 2026
కొండగట్టులో అంతా సిద్ధం.. మరి కొద్ది సేపట్లో పవన్ రాక

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ఈ రోజు టీటీడీ నిధులతో వసతి గదులు, దీక్షా విరమణ మండపం నిర్మాణం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనుండగా, అధికారులు అంతా సిద్ధం చేసారు. ఇక పవన్ రాక కోసం ఇటు అధికారులు, మరో వైపు అభిమానులు ఎదురు చూస్తున్నారు. పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో ఉ.10 – 20 గంటలకు చేరుకొని, తిరిగి 3 గంటల తర్వాత HYD వెళ్లనున్నారు.


