News July 6, 2024
బాసరలో ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
Similar News
News February 20, 2026
బాసర గోదావరిలో గుర్తు తెలియని మహిళ మృతి

నవీపేట్ మండల పరిధిలోని బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నవీపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.
News February 20, 2026
NZB: నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల ఆరాటం

మార్చి15లోగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడంతో ఆశావహుల్లో ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అసంతృప్తులకు, రెబల్స్‌కు నామినేటెడ్ పోస్టులు, జిల్లా కమిటీల్లో పార్టీ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తామన్న హామీలు, భరోసాను కల్పించారు. ఈ నేపథ్యంలో భర్తీ ప్రకటన వెలువడడంతో వారిలో ఆశలు మొదలయ్యాయి. కాగా DCCB ఛైర్మన్ పదవిని పురన్ రెడ్డికి ఖరారు చేసినట్లు సమాచారం.
News February 20, 2026
నిజామాబాద్ కా ‘రాణి’..!

మున్సిపల్ ఎన్నికల వరకు ఆమె ఓ సాధారణ మహిళ. రాజకీయాలు అస్సలు తెలియదు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో NZB 49వ డివిజన్ నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ లభించింది. కనీసం ప్రచారంలో సైతం పేరు వినిపించని ఆమె గెలుపొంది అనూహ్యంగా నగర ప్రథమ పౌరురాలి స్థానం పొందారు. ఆర్మూర్‌కు చెందిన జర్నలిస్ట్ బెడిద రాజేశ్వర్‌రావు కూతురు, కరాటే రమేశ్ భార్య ఉమారాణి. నేడు ఆమె మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.


