News April 4, 2025
బాసరలో వరంగల్ విద్యార్థి మృతి

నిర్మల్ జిల్లా బాసర వేద భారతి విద్యాలయంలో కరెంట్ షాక్‌తో విద్యార్థి మృతిచెందాడు. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. ఇక్కడ గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతిచెందటం ఆందోళనకరం. ఘటనపై బాసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 11, 2025
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక ఆదేశాలు

TG: అకాల వర్షాలతో రాష్ట్రంలో పలు చోట్ల ధాన్యం తడిసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని, తరుగు తీస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ మంచి పథకమని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
News April 11, 2025
రేపే రిజల్ట్.. ఏలూరు జిల్లాలో విద్యార్థులు ఎదురు చూపు

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. ఏలూరు జిల్లాలో 32,411 మంది ఇంటర్ విద్యార్థులు రాయగా వీరిలో ప్రథమ సంవత్సరం 18,195, ద్వితీయ సంవత్సరం 14,216 విద్యార్థులు పరీక్షల రాశారు. మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 11, 2025
WGL: చిరుదాన్యాల ధరల వివరాలు….

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో నేడు (శుక్రవారం) చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,250 పలికింది. అలాగే పసుపు (కాడి) క్వింటా ధర రూ.13,659, పసుపు (గోల)కి రూ.12,689 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,320 పలికినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మక్కల ధర 2 రోజులతో పోలిస్తే పెరిగింది.