News April 4, 2025

బాసరలో వేద భారతి విద్యాలయంలో విషాదం

image

బాసర మండలకేంద్రంలోని వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఓ విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

Similar News

News April 11, 2025

వేసవిలో వాకింగ్.. ఎప్పుడు చేయాలంటే..

image

వాకింగ్ అలవాటున్నవారికి వేసవిలో వేడిమి సమస్యగా ఉంటుంది. వారు ఆలస్యంగా లేచి వాకింగ్ చేయడం మంచిదికాదని జీవనశైలి నిపుణులు పేర్కొంటున్నారు. ‘సమ్మర్‌లో ఉదయం 7.30 గంటల్లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడి తీవ్రత పెరుగుతుంటుంది. అది ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటాక, సాయంత్రం 5 గంటలలోపు ఆరుబయట వ్యాయామం, వాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు’ అని సూచిస్తున్నారు.

News April 11, 2025

వరంగల్ మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News April 11, 2025

నేడే జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి కొండా

image

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో నేడు జాబ్ మేళా జరగనుంది. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి వరంగల్‌లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్‌లో ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.

error: Content is protected !!