News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో ADB బిడ్డల ప్రతిభ

హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న 11వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో మంగళవారం మొదటి రోజు ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు. అనిల్, రాణి సిల్వర్ మెడల్ సాధించగా, అరుణ, సక్కు కాంస్యం మెడల్స్ సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ తెలిపారు. క్రీడల్లో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
News February 19, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

ప్రేమ పేరుతో లోబరుచుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన యువకుడిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన యువతిని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.
News February 19, 2025
ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలో టెండర్లు

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని బస్ స్టేషన్లలో పక్కా స్థలం, ఖాళీ ప్రదేశాల్లో వ్యాపారాల నిర్వహణకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజర్ కల్పన ప్రకటనలో పేర్కొన్నారు. ఆక్షన్, మ్యానువల్ టెండరు విధానాల్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, గుడిహత్నూర్, జైనథ్, ఇచ్చోడ బస్‌స్టేషన్లలో మొత్తం 19 స్థలాలకు టెండర్లు దరఖాస్తు ఫారాలు ఈనెల19వరకు సమర్పించాలన్నారు.