News September 22, 2025

బాసర ఆర్జీయూకేటీలో హ్యాకథాన్ ముగింపు

image

బాసర ఆర్జీయూకేటీలో కంప్యూటర్ సైన్స్ విభాగం నిర్వహించిన రెండు రోజుల ఇంటర్నల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ముగిసింది. ఇందులో 40 బృందాల నుంచి 240 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఫ్యాకల్టీ సహకారంతో ప్రాబ్లెమ్ స్టేట్‌మెంట్‌కు ప్రోటోటైప్‌ను రూపొందించారు. వారి పరిష్కారాలు, ప్రోటోటైప్‌లపై అవగాహన కల్పించారు.

Similar News

News September 22, 2025

ANU: పీజీ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జూలై నెలలో నిర్వహించిన పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, పీజీ డిప్లమా ఇన్ గైడెన్స్ ఇన్ కౌన్సిలింగ్ ఫలితాలను విడుదల చేశారు. రీవాల్యుయేషన్కు ఆసక్తి ఉన్న విద్యార్థులు వచ్చే నెల ఆరో తేదీలోపు రూ.1860 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 22, 2025

రెండు రోజుల క్రితం లేఖ.. ఇవాళ హతం

image

ఆయుధాలు వదిలే ప్రసక్తే లేదంటూ ప్రకటించిన రెండు రోజులకే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా <<17796054>>రామచంద్రారెడ్డి<<>> ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఆయుధాలు వదిలేస్తామంటూ అభయ్ పేరుతో ఇటీవల లేఖలు కలకలం రేపాయి. ఆ ప్రకటన పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ ఈ నెల 20న లేఖ విడుదల చేశారు. అది తాజాగా బయటకు రావడం, ఆయన మరణించడం చర్చనీయాంశమైంది.

News September 22, 2025

అనుమతులు తప్పనిసరి: అల్లూరి ఎస్పీ

image

శాంతి భద్రతలకు భంగం కలగకుండా దసరా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం ప్రజలకు సూచించారు. దసరా మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకోవడానికి అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్ధం చేసే సౌండ్ సిస్టమ్‌లు ఉపయోగించకూడదన్నారు. నిబంధనలు పాటిస్తూ, పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు.