News February 12, 2025
బాసర ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి

బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీశ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తలమానికం తెలంగాణలోని ఏకైక సరస్వతి దేవాలయం బాసర సరస్వతి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో చేర్చాలని వినతి పత్రం ఇచ్చినట్టు తెలిపారు. వీరితో ఎంపీ గోడం నగేశ్ ఉన్నారు.
Similar News
News February 19, 2026
మహా శివరాత్రి.. కడప జిల్లా ఆర్టీసీకి ఆదాయం ఎంతంటే..!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్ ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఆర్టీసీ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు 1,46,077 KM నడిపినట్లు చెప్పారు. దీంతో రూ.1.11 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
News February 19, 2026
‘వారణాసి’ నాకు కెరీర్ డిఫైనింగ్ సినిమా: ప్రియాంకా చోప్రా

‘వారణాసి’ తనకు కెరీర్ డిఫైనింగ్ సినిమా అవుతుందని హీరోయిన్ ప్రియాంకా చోప్రా తెలిపారు. ‘రాజమౌళికి ఉన్న విజన్ ఎవరికీ లేదు. ఆయనతో వర్క్ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉంది. నా కెరీర్‌పై ఈ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతున్నా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు ఇది చాలా భిన్నం’ అని ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా 2027 APR7న రిలీజ్ కానుంది.
News February 19, 2026
డెలివరీ తర్వాత ఇలా చేయండి

బిడ్డను ప్రసవించిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. అలాగే తల్లి డీహైడ్రేట్ అవ్వకుండా వైద్యుల సలహాతో ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. సాధారణ ప్రసవం తర్వాత చాలావరకు ఇబ్బందులు రావు. సిజేరియన్ జరిగితే మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. శరీరానికి విశ్రాంతి అవసరం. సిజేరియన్ జరిగితే మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడాలి.


