News March 21, 2025
బాసర: మహిళ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన కొమ్ము సుమలత వారి ఇంటి వద్ద కనిపించడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురువారం బాసర గోదావరి నదిలో దూకేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆమెను ప్రాణాలతో కాపాడారు.
Similar News
News September 16, 2025
HYDలో ఒక్కో ఎకరం రూ.101 కోట్లు

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్‌లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.
News September 16, 2025
అనంత్ అంబానీ ‘వనతారా’కు సిట్ క్లీన్ చిట్

అనంత్ అంబానీ గుజరాత్‌లో స్థాపించిన ‘వనతారా’ జంతు సంరక్షణ కేంద్రానికి SCలో ఊరట లభించింది. వనతారాకు విదేశాల నుంచి ఏనుగుల తరలింపుపై దాఖలైన పిల్‌ను విచారించి కొట్టేసింది. సిట్ వనతారాకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఏనుగులను తరలిస్తే అందులో ఎలాంటి తప్పులేదని స్పష్టం చేసింది. ఏనుగులను యజమానులకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
News September 16, 2025
అన్నమయ్య: ‘బొప్పాయి తక్కువకు అడిగితే కాల్ చేయండి’

అన్నమయ్య జిల్లాలో సెప్టెంబర్ 16వ తారీఖున టాప్ గ్రేడ్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.8లుగా నిర్ణయించబడిందని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సెకండ్ గ్రేట్ బొప్పాయి ఎగుమతి ధర కిలో రూ.7లుగా నిర్ణయించామని ఆయన అన్నారు. ఎవరైనా ట్రేడర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు కంట్రోల్ రూమ్ నంబర్ (9573990331, 9030315951) సంప్రదించవచ్చని రైతులకు సూచించారు.