News March 21, 2025

బాసర: మానవత్వం చాటుకున్న పోలీసులు

image

బాసర పోలీసులు మానవత్వం చాటుకున్నారు. బాసరలోని శారద నగర్‌ విద్యుత్ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై ఓ అనాథ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ పడిపోయింది. వెళుతున్న పోలీసులు గమనించి వెంటనే ఆమెను 108లో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె కొంతకాలంగా పలు కాలనీల్లో ప్లాస్టిక్ వస్తువులను పోగు చేసి వచ్చిన డబ్బులతో జీవిస్తోందన్నారు.

Similar News

News September 14, 2025

నకరికల్లు: కాలువలో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

image

నకరికల్లు మండలం కుంకలగుంటలో శనివారం కాలువలో పడి గల్లంతైన రెండేళ్ల బాలుడి మృతదేహం <<17705891>>లభ్యమైంది<<>>. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కుంకలగుంట రైల్వే స్టేషన్ సమీపంలోని పంట కాలువలో బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాలుడు ఇంటి బయట అరుగుపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News September 14, 2025

రసూల్‌పురా జంక్షన్ వద్ద రూ.150 కోట్లతో ఫ్లైఓవర్

image

గ్రేటర్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి రసూల్‌పురా జంక్షన్ వద్ద రూ.150 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 4లేన్లతో, వై ఆకారంలో నిర్మించే ఈఫ్లైఓవర్‌కు GHMC టెండర్లు ఆహ్వానించింది. భూసేకరణకే దాదాపు రూ.70 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.

News September 14, 2025

బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు

image

బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలో వేద పండితుల మధ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పలువురు శుభాకాంక్షలు చెప్పారు.