News January 31, 2025
బాసర : వసంత పంచమికి ఏర్పాట్లను పగడ్బందీగా నిర్వహించాలి

వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం బాసరలో పర్యటించిన కలెక్టర్ వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గోదావరి పుష్కర ఘాట్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి పుష్కర ఘాట్ ప్రదేశంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలన్నారు.
Similar News
News December 31, 2025
ఆయిల్‌పామ్ సాగు, మొక్కల ఎంపికలో జాగ్రత్తలు

ఆయిల్‌పామ్ సాగు కోసం 12 నెలల వయసు, 1 నుంచి 1.2మీ ఎత్తు, 20-25 సెం.మీ. కాండము మొదలు చుట్టుకొలత మరియు 12 ఆకులతో ఆరోగ్యంగా ఉన్న మొక్కలను నాటుటకు ఎంపిక చేసుకోవాలి. నాటేటప్పుడు మాత్రమే మొక్కలను నర్సరీ నుంచి తీసుకురావాలి. సమాంతర త్రిభుజాకార పద్ధతిలో ఎకరాకు 57 మొక్కలు (హెక్టారుకు 143 మొక్కలు), చతురస్రాకార పద్ధతిలో ఎకరాకు 50 మొక్కలు (హెక్టారుకు 123 మొక్కలు) నాటుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News December 31, 2025
ఒత్తు పొత్తును చెరుచు

ఒంటి ఎద్దుతో సేద్యం చేసేటప్పుడు నాగలి లేదా కాడిని ఎద్దు మెడపై సరిగా పెట్టకుండా, ఒక పక్కకే ఎక్కువ ఒత్తు (ఒత్తిడి) పడేలా చేస్తే, అది ఎద్దు మెడపై పొత్తు (చర్మం) దెబ్బతినడానికి, వాపు రావడానికి కారణమవుతుంది. అందుకే సేద్యం చేసేటప్పుడు కాడి భారం ఎద్దు భుజాలపై సమానంగా పడాలి. ఎద్దుకు నొప్పి కలిగితే అది సరిగా నడవలేదు, దీనివల్ల సేద్యం ఆలస్యమవుతుంది, పశువు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఈ సామెత చెబుతుంది.
News December 31, 2025
ఒకరోజు ముందే పెన్షన్లు.. నేడు పంపిణీ!

AP: ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనుంది. ఇవాళ అందజేసేందుకు చర్యలు చేపట్టింది. కొత్త ఏడాది ప్రారంభం నేపథ్యంలో NTR భరోసా పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ముందుగానే రూ.2,743 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా పెన్షన్‌దారులకు నేడు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇవాళ తీసుకోని వారికి 2వ తేదీ పంపిణీ చేస్తారు.


