News April 9, 2025
బాసర RGUKTలో 41 మంది కాంట్రాక్టు అధ్యాపకుల రాజీనామా

ప్రభుత్వ GO21పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆర్జీయూకేటీ బాసరలో విధులు నిర్వహిస్తున్న 41మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదనపు బాధ్యతలను చేయలేమంటూ ఆ బాధ్యతలకు మూకుమ్మడి రాజీనామా లేఖను ఏవో రణధీర్‌కు అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా టీచింగ్, పరిపాలన బాధ్యతలతో పాటు విశ్వవిద్యాలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఊరుకోమన్నారు.
Similar News
News February 26, 2026
ఖర్గేతో జగ్గారెడ్డి భేటీ.. రాజ్యసభ సీట్లపై చర్చ !

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
News February 26, 2026
ఒకే జిల్లాకు భార్య కలెక్టర్, భర్త ఎస్పీ

TG: రాష్ట్రంలో ఇవాళ <<19241780>>ఐఏఎస్‌ల బదిలీ<<>> తర్వాత ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్‌గా స్నేహా శబరీశ్ నియమితులు కాగా అదే జిల్లాకు ఆమె భర్త శబరీశ్ ఎస్పీగా పనిచేస్తుండటం విశేషం. ఒకే జిల్లాకు భార్యాభర్తలు కలెక్టర్, ఎస్పీలుగా ఉండటం అరుదైన విషయం. కాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న అద్వైత్ కుమార్ సింగ్ మరోచోటుకు బదిలీ అయ్యారు. స్నేహా గతంలో హనుమకొండ కలెక్టర్‌గా పనిచేశారు.
News February 26, 2026
మేడారం జాతరలో 40 శాతం పెరిగిన కాలుష్యం!

మేడారం జాతరలో ధూళి కణాలు సాధారణ స్థాయి కంటే 40% ఎక్కువగా నమోదయ్యాయి. వరంగల్ జిల్లా పొల్యూషన్ బోర్డ్ అధికారులు జాతర తేదీల్లో నమూనాలు సేకరించి ల్యాబ్‌లో పరిశోధించారు. PM10 ధూళి కణాలు సాధారణంగా 100% ఉండాలి. జాతర సందర్భంలో 120 నుంచి 140 శాతం వరకు నమోదైనట్లు పొల్యూషన్ బోర్డ్ జిల్లా అధికారి సునీత తెలిపారు. చిన్న పరిమాణం కారణంగా అవి ఊపిరితిత్తుల్లోకి లోతుగా చొచ్చుకెళ్లి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


