News January 21, 2025

బిక్కనూరు: పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. మంగళవారం బిక్కనూరు మండలం భగీరథ పల్లి గ్రామంలో జరిగిన ప్రజా పాలన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఆత్మీయ భరోసా పథకాలను అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రజిత, తహశీల్దార్ శివప్రసాద్ ఉన్నారు.

Similar News

News February 22, 2026

జగిత్యాల: అటవీశాఖ హెచ్చరిక.. చిరుత కలకలం

image

జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని గోవిందారం, మోత్కరావుపేట, రాజలింగంపేట, ఒడ్యాడ్ గ్రామాల్లో చిరుతపులి సంచారిస్తుందనే సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి చిరుత పాదముద్రలను గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు. రాత్రివేళ రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లరాదని, అనుమానాస్పద ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

News February 22, 2026

భద్రాచలం: రేపు ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన దర్బార్

image

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేయాలని కోరారు. గిరిజన దర్బార్‌కు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

News February 22, 2026

తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

image

సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించనన్నారు. ఇప్పటికే అర్జీలు ఇచ్చి సమస్య పరిష్కారం కాకపోయిన వారు లేదా తమ ఫిర్యాదుల స్థితి తెలుసుకోవాలనుకునే వారు 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.