News February 9, 2025

బిక్కనూర్: గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మంది అరెస్ట్

image

గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసే రిమాండ్‌కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రంతో పాటు జంగంపల్లి రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించడంతో పాటు దానిని సేవిస్తూ పలువురు యువకులను బానిస చేస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో వారిని అదుపులోకి తీసుకొని విచారించి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

Similar News

News January 9, 2026

బాపట్ల: భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు

image

నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తెనాలి 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. భార్యను హత్య చేసిన భర్తకు కఠిన శిక్ష పడేలా సమగ్ర దర్యాప్తు, బలమైన సాక్ష్యాలు అందించిన పోలీసు అధికారులను ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. నేరస్తులకు శిక్షలు పడితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.