News March 11, 2025
బిక్కనూర్: ‘గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు వేగవంతం చేయాలి’

బిక్కనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటును వేగవంతం చేయాలని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంపత్ కుమార్, ఎస్ఐలు ఆంజనేయులు, పుష్పరాజ్, స్రవంతి, ప్రభాకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News March 12, 2025
KMR: బడ్జెట్ సమావేశాలు.. ఈ పనులపై గళం విప్పాలి!

అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు గళం విప్పి పలు పనులకు సంబంధించి నిధులు తెస్తారని ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్త నడకన సాగుతున్నాయి. మహారాష్ట్ర, కామారెడ్డి జిల్లాకు సరిహద్దులో ఉన్న లెండి ప్రాజెక్టు నిధుల గ్రహణం వీడడం లేదు. కాళేశ్వరం ప్యాకేజీ 22కు నిధుల గండం. ఏం చేస్తారో చూడాలి మరి..!
News March 12, 2025
భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News March 12, 2025
MBNR: LRS రాయితీ.. ఫోన్ చేయండి.!

మహబూబ్ నగర్ జిల్లాలో ఎల్ఆర్ఎస్(LRS) దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 31లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లిస్తే ప్రభుత్వం 25% రాయితీ కల్పించినట్లు కలెక్టర్ విజయేందిర ఓ ప్రకటనలో తెలిపారు. సందేహాలు ఉంటే కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 08542-241165, జిల్లా నగర పాలక సంస్థలో హెల్ప్ లైన్ నంబర్ 7093911352 (ఉ.10 గంటల-సా.6 గంటల వరకు)కు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.