News March 29, 2025
బిక్కనూర్: బీడీ కార్మిక సంఘం అధ్యక్షుడి ఎన్నిక

రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా సందుగారి రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు. బిక్కనూర్ మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన ఆయన బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఆయనను రాష్ట్ర బీడీ కార్మిక సంఘం అధ్యక్షునిగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News April 1, 2025
ఏప్రిల్ 1: చరిత్రలో ఈరోజు

1578: రక్తప్రసరణ సిద్ధాంతాన్ని వివరించిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే జననం 1889: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ జననం
1935: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన
1936: ఒడిశా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
1941: భారత మాజీ క్రికెటర్ అజిత్ వాడేకర్ జననం
2022: తెలుగు చిత్ర దర్శకుడు శరత్ మరణం
News April 1, 2025
నారాయణపేట: భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు గ్రామంలో చోటుచేసుకుంది. మరికల్ ఎస్ఐ రాము కథనం మేరకు.. తీలేరు గ్రామానికి చెందిన సుభాష్‌కు తన భార్యకు కొన్ని రోజుల క్రితం గొడవలు జరగగా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రమ్మన్నా ఆమె రాకపోవడంతో మనస్తాపం చెందిన సుభాష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News April 1, 2025
ADB: ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ఆదిలాబాద్ కేంద్రీయ విద్యాలయ ఖాళీ సీట్లలో ప్రవేశానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. రెండో తరగతి నుంచి 8వ తరగతుల్లో ఖాళీ సీట్లు ఉన్నాయన్నారు. తాత్కాలిక ఖాళీల జాబితా, అర్హత ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ మొదలైన వాటికోసం వెబ్ సైట్ https://adilabad.kvs.ac.in/ సందర్శించాలని లేదా విద్యాలయాన్ని సందర్శించాలని కోరారు.