News October 15, 2025

బిక్కనూర్: మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

image

మద్యానికి బానిసగా మారి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్ మండలం జంగంపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నితిన్(21) కొంతకాలంగా మద్యానికి బానిసగా మారి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Similar News

News October 15, 2025

నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నేడు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేయనున్నారు. షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేయబోతున్నారు. ఆమె వెంట కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లనున్నారు. సాదాసీదాగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 19న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ ర్యాలీకి బీఅర్ఎస్ సన్నాహాలు మొదలుపెట్టింది.

News October 15, 2025

తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక

image

AP: శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఘాట్ రోడ్ విస్తరణ, భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. 3 దశల్లో డెవలప్‌‌మెంట్ పనులకు దాదాపు 4,900 ఎకరాల అటవీ భూములు అవసరం కానున్నాయి. ఈనెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ భూములపై నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

News October 15, 2025

నెల్లూరు TDP నేతల తీరుపై పల్లా ఆగ్రహం..?

image

జిల్లా TDP నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలకు ఫోన్లు చేసి పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని కాపాడుకోవాలని హితవు పలికారట.