News January 7, 2026

బిక్కనూర్: ‘మరో ఉద్యమం స్టార్ట్ చేస్తాం’

image

బిక్కనూర్ మండల కేంద్రంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు <<18786879>>నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని<<>> పట్టణానికి చెందిన న్యాయవాది రాజబాబు గౌడ్, గ్రామస్థులు సూచించారు. ఈరోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయం వెనకకు తీసుకోకపోతే మరో ఉద్యమం స్టార్ట్ చేస్తామని హెచ్చరించారు.

Similar News

News February 10, 2026

ఏలూరు: నిధుల వినియోగంపై కలెక్టర్ సమీక్ష

image

సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. నిధుల వినియోగంపై స్పష్టమైన ప్రణాళికతో వ్యవహరించాలని, ఫిబ్రవరి ఆఖరుకల్లా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏలూరు కోకో సిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అడుగులు వేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

News February 10, 2026

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి: కలెక్టర్

image

పీహెచ్సీల్లో డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి వాట్సప్ గవర్నెన్స్‌పై అధికారులతో సమీక్ష ద్వారా మాట్లాడారు. వాట్సప్ గవర్నెన్స్‌లో ఈ నెల కూడా జిల్లా మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. నాలుగు రోజుల్లోపు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News February 10, 2026

చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే..

image

చామంతి సాగులో కొన్ని సార్లు పువ్వుల పరిమాణం మరీ తక్కువగా ఉంటుంది. దీని వల్ల రైతులకు ఆశించిన ధర రాదు. చామంతి పువ్వుల పరిమాణం పెరగాలంటే.. మొక్కల తలల కత్తిరింపు చేపట్టిన తర్వాత 20 నుంచి 25 రోజులకు లీటరు నీటిలో 50 ppm జిబ్బరెల్లిక్ ఆమ్లం (50 మిల్లీ గ్రాములను) కలిపి పిచికారీ చేయాలని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు.