News January 15, 2026

బిక్కనూర్: ‘వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది జీవన విధానం’

image

వ్యవసాయం ఉద్యోగం కాదు.. అది మన జీవన విధానం అని చాటిచెప్పింది కాచాపూర్ గ్రామానికి చెందిన చిన్నారి మహాన్వి. సంక్రాంతి పురస్కరించుకుని గురువారం ఆమె వేసిన ముగ్గు గ్రామస్తులను ఆలోచింపజేసింది. రైతు జీవన శైలిని ప్రతిబింబిస్తూ రంగురంగులతో తీర్చిదిద్దిన ఈ రంగవల్లిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే వ్యవసాయంపై మమకారాన్ని చాటిన మహాన్విని పలువురు అభినందించారు.

Similar News

News February 20, 2026

నెల్లూరు: గురుకుల పాఠశాలలో కరెంట్ షాక్ తగిలి వ్యక్తి మృతి

image

బుచ్చి(మం) రామచంద్రపురం గురుకుల పాఠశాలలో కరెంటు షాక్ తగిలి ఓ కూలి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీపై ఇనుప ముల్ల కంచె ఏర్పాటు చేస్తుండగా నెల్లూరుకు చెందిన ఓ కూలి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే బుచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 20, 2026

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన ‘ఎర్ర బంగారం’

image

ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్‌కు గురువారం రైతులు రికార్డు స్థాయిలో 40 వేల బస్తాల పంటను తరలించారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. అయితే, గత వారం క్వింటాకు రూ.18,700 పలికిన ధర, ప్రస్తుతం రూ.18,200కు తగ్గింది. భారీగా బస్తాలు రావడంతో తలెత్తిన ట్రాఫిక్ సమస్యను మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరావు, సిబ్బంది పరిష్కరించారు. పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు తరలిరావడంతో మార్కెట్ ప్రాంగణం సందడిగా మారింది.

News February 20, 2026

KNR: రేషన్ కార్డుదారులారా.. లేట్ చేయకండి..!

image

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఈ- కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్తగా కార్డులు పొందినవారు, పాత కార్డుల్లో పేరు జత చేసుకున్నవారు ఈ- కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. మీ సమీపంలోని రేషన్ దుకాణంలో e-PoS యంత్రంలో వేలిముద్రలు వేసి ఉచితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు. SHARE IT.