News December 22, 2025

బిగ్‌బాస్ విన్నర్.. ఎంత గెలుచుకున్నారంటే?

image

బిగ్‌బాస్ సీజన్-9 విజేతగా నిలిచినందుకు కళ్యాణ్ పడాల రూ.35 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. దీంతో పాటు వారానికి రూ.70వేల చొప్పున రూ.10.50 లక్షలు సంపాదించారు. రాఫ్ టైల్స్ కంపెనీ ఆయనకు మరో రూ.5 లక్షలు గిఫ్ట్‌గా ఇచ్చింది. దీంతో మొత్తం రూ.50 లక్షలు దాటింది. మరోవైపు మారుతీ సుజుకీ విక్టోరిస్ కారును ఆయన అందుకున్నారు.

Similar News

News December 25, 2025

విశాఖ స్టీల్ ప్లాంటులో మూడో విడత VRS

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 JAN 1 తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 45ఏళ్లు దాటిన ఉద్యోగులను అర్హులుగా పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి 1,146, రెండోసారి 487 మంది VRSకు అంగీకరించారు. ఈసారి 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలనే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

News December 25, 2025

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే.!

image

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే పలు ప్రయోజనాలున్నాయి. ‘రాత్రి నిద్రలో శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి వాటర్ తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది అలసట, తలనొప్పి తగ్గించి శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగై మలబద్దకం ఉన్నవారికి సహాయపడుతుంది. మెటబాలిజం 20-30% పెరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని వైద్యులు చెబుతున్నారు.

News December 25, 2025

ఏటి ఈతకు లంక మేతకు సరి

image

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.