News December 22, 2025

బిగ్‌బాస్ విన్నర్‌ కంటే ఇతడికే ఎక్కువ రెమ్యునరేషన్!

image

నిన్నటితో ముగిసిన బిగ్‌బాస్-9లో కళ్యాణ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అతడు రూ.35లక్షలు గెలుచుకున్నారు. అయితే 4వ స్థానంలో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్‌.. కళ్యాణ్ కంటే ఎక్కువ మనీ అందుకున్నట్లు తెలుస్తోంది. 15వారాలకు గానూ వారానికి రూ.2.50 లక్షల చొప్పున అతడు మొత్తం రూ.35-40లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న వారిలో ముందువరుసలో ఇమ్మాన్యుయేల్ ఉన్నారు.

Similar News

News December 25, 2025

గిగ్ వర్కర్ల సమ్మె: నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

డిసెంబర్ 25, 31 తేదీల్లో స్విగ్గీ, జొమాటో సహా ప్రముఖ సంస్థల డెలివరీ ఏజెంట్లు సమ్మెకు పిలుపునిచ్చారు. పడిపోతున్న ఆదాయం, అధిక పని గంటలు, సెక్యూరిటీ లేని స్పీడీ డెలివరీ లక్ష్యాలకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తున్నారు. వర్క్ ప్లేస్‌లో సోషల్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో సిటీలతో పాటు టైర్2 పట్టణాల్లో ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సి రావొచ్చు!

News December 25, 2025

క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం: ఒక్క టీకాతో అన్నింటికీ చెక్!

image

యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దిశగా US శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒకే ఇంజెక్షన్ వేర్వేరు క్యాన్సర్లను అడ్డుకుంది. ఈ నానోపార్టికల్ టీకాతో 88% ఎలుకలు ప్రాణాంతక ట్యూమర్ల నుంచి బయటపడ్డాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. క్యాన్సర్లు మళ్లీ రాకుండా, ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. త్వరలో మనుషులపై పరీక్షలు జరగనున్నాయి.

News December 25, 2025

పాత్రల నీచు వాసన ఇలా దూరం

image

మాంసాహార వంటకాలు వండిన తర్వాత ఆ పాత్రలు ఎంత శుభ్రం చేసినా నీచు వాసన వస్తూనే ఉంటాయి. ఆ వాసన పోవాలంటే ఈ టిప్స్ పాటించండి. ముందుగా మాంసం వండిన పాత్రలను నీటితో శుభ్రం చేసి తర్వాత కాస్త వెనిగర్ చల్లాలి. కాసేపటి తర్వాత వేడినీటితో కడిగితే సరిపోతుంది. నిమ్మచెక్కతో పాత్రలను రుద్దినా వాసనలు పోతాయి. బకెట్ నీళ్లల్లో బేకింగ్ సోడా వేసి దానిలో కడిగిన పాత్రలను ముంచి తీసినా దుర్వాసన పోతుంది.