News December 15, 2025
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్-5 వీళ్లే

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఫైనల్‌కు మరో వారం మాత్రమే మిగిలి ఉండగా టాప్-5 ఫైనలిస్టులు ఖరారయ్యారు. తనూజ, డిమోన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన ఫైనల్ రేసులోకి అడుగుపెట్టారు. తాజాగా జరిగిన డబుల్ ఎలిమినేషన్‌లో శనివారం <<18553037>>సుమన్‌శెట్టి<<>> ఇంటి నుంచి బయటకు వెళ్లగా, ఆదివారం <<18559680>>భరణి<<>> ఎలిమినేట్ అయ్యారు. దీంతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
Similar News
News December 15, 2025
బెంగాల్‌లో 58 లక్షల ఓట్ల తొలగింపు!

బెంగాల్‌లో SIR ప్రక్రియ ముగియడంతో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణను EC ప్రారంభించింది. రేపు డ్రాఫ్ట్ లిస్ట్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచనుంది. రాష్ట్రంలో 7.66కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. SIRలో భాగంగా 58.2 లక్షల ఓట్లను తొలగించినట్లు సమాచారం. 31.39 లక్షల మంది విచారణకు హాజరుకానున్నట్లు EC స్టేటస్ రిపోర్టు ద్వారా తెలుస్తోంది. మరో 13 లక్షలకు పైగా ASD(ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్&డూప్లికేట్ ఓటర్స్)లను గుర్తించారు.
News December 15, 2025
JIO నుంచి అదిరిపోయే ప్లాన్స్!

న్యూఇయర్ సందర్భంగా JIO కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. రూ.3,599తో రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు డైలీ 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలు లభిస్తాయి. దీంతోపాటు రూ.35,100 విలువైన Google Gemini Pro ప్లాన్ కూడా 18నెలల పాటు ఉచితం. ₹500తో 28రోజులు డైలీ 2GB, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలతో పాటు పలు OTT ప్లాట్‌పామ్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ. ₹103తో 28 రోజుల పాటు 5GB డేటా పొందొచ్చు.
News December 15, 2025
జెలెన్‌స్కీ కొత్త ప్రతిపాదన

రష్యాతో యుద్ధాన్ని ముగించే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కొత్త ప్రతిపాదన చేశారు. పశ్చిమ దేశాలు భద్రతపై హామీ ఇస్తే NATOలో చేరాలన్న ప్రయత్నాలను విరమించుకోవడానికి రెడీ అని ప్రకటించారు. ‘కూటమి సభ్యులకు లభించే తరహాలో భద్రతా హామీలు ఆశిస్తున్నాం. రష్యా మరోసారి ఆక్రమణకు దిగకుండా నిరోధించేందుకు మాకు ఇదో అవకాశం’ అని చెప్పారు. తమ భూభాగాన్ని రష్యాకు వదులుకోవాలన్న US ప్రతిపాదనను నిరాకరించారు.


