News December 14, 2025

బిగ్‌బాస్-9.. భరణి ఎలిమినేట్!

image

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉన్న విషయం తెలిసిందే. నిన్న అంతా ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇవాళ భరణి ఎలిమినేట్ కానున్నారని SMలో పోస్టులు వైరలవుతున్నాయి. అదే జరిగితే కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డిమాన్ పవన్, సంజన టాప్-5కి చేరుకుంటారు.

Similar News

News April 8, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

image

ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.3,980 పెరిగి రూ.1,53,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 ఎగబాకి రూ.1,41,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.

News April 8, 2026

ఈ యుద్ధంలో నిజంగా ఓడింది సామాన్యుడే!

image

సీజ్‌ఫైర్‌ను US, ఇరాన్ రెండూ తమ విజయంగా చెప్పుకొన్నాయి. లక్ష్యాలు నెరవేరాయని ప్రకటించుకున్నాయి. కానీ 38 రోజుల ఈ యుద్ధంలో నిజంగా ఓడింది మాత్రం సామాన్యుడే. చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. చాలా దేశాలు ఎకనామిక్ క్రైసిస్‌లో చిక్కుకున్నాయి. పరువు కోసం ఇరాన్, US గెలుపు పాటలు పాడుతున్నా.. ప్రపంచం మాత్రం ఆ భారాన్ని ఇంకా మోయాల్సిందే.

News April 8, 2026

సీజ్‌ఫైర్: రాకెట్‌లా దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు

image

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. నిఫ్టీ ఏకంగా 766 పాయింట్లు లాభపడి 23,890 వద్ద ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 2,587 పాయింట్లు ఎగసి 77,204 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వరుసగా 4వ సెషన్‌లోనూ రూపాయి విలువ బలపడింది. డాలర్‌తో పోలిస్తే 0.4 శాతం ఎగసి 92.61కి చేరింది.