News April 2, 2025
బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇవ్వాలని ఆర్టిస్ట్ నిరసన

బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ ఓ సినీ ఆర్టిస్ట్ నిరాహార దీక్ష చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అన్నపూర్ణ స్టూడియో సమీపంలో మిర్యాలగూడకు చెందిన రామాచారి అనే నటుడు తాను కూలీ బిడ్డనని, తనకు బిగ్ బాస్ సీజన్ 9లో అవకాశం కల్పించాలంటూ నిరాహార దీక్ష చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రామాచారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Similar News
News April 3, 2025
NLG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ITI, డిప్లొమా, NCC కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic. వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
News April 3, 2025
మూసీకి పూడిక ముప్పు..!

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.
News April 3, 2025
రేషన్ కార్డుల అప్లై నిరంతర ప్రక్రియ: జిల్లా కలెక్టర్

రేషన్ కార్డుల అప్లై నిరంతర ప్రక్రియ అని, కొత్త రేషన్ కార్డులకు మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. సాగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రేషన్ కార్డులో పేర్లను సైతం మీ- సేవ కేంద్రాలద్వారా చేర్చుకోవచ్చని చెప్పారు. చనిపోయిన వారి పేర్లను తామే స్వచ్ఛందంగా రేషన్ కార్డుల నుంచి తొలగిస్తామని తెలిపారు.